27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వస్తుంది 4,90,000.. పోతుంది 5,71,217..

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ : వరుడు కరుణించి కురిపిస్తున్న భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 4,90,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. అలాగే ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి, కాలువల ద్వారా మొత్తం 5,71,217 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తి గోదావరిలోకి 5,50,350 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని అలాగే వరద కాలువ ద్వారా 12,000 క్యూసెక్కులు, స్కేప్ గేట్ల ద్వారా 8000క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని తెలియజేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా శుక్రవారం ప్రాజెక్టులో రాత్రి 8 గంటలకు 1085.6 అడుగులు, 61.88 టీఎంసీల నీటిమట్టం ఉందని తెలియజేశారు.

More articles

Latest article