జుక్కల్, బతుకమ్మ: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ లో సోయా కొనుగోలు కేంద్రం త్వరలో పున: ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. కొనుగోళ్లను నిలిపివేయడంతో సుమారు 8వేల క్వింటాళ్ల సోయా మిగలిపోయి రైతులు ఆందోళనకు గురయ్యారన్నారు. పరిస్థితిని రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు వివరించామన్నారు. ఎలాగైనా సోయా కొనుగోలు చేయించి రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలని దృఢ నిశ్చయంతో ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. వెంటనే సోయా కొనుగోలు కేంద్రాన్ని పున: ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని, రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.
