జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

0 1,562

బతుకమ్మ, పిట్లం : జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే  డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున  జొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కందులు పెసలు శనగలు జొన్నలు కొనుగోలు చేశామని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంది గాని న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ స్పష్టం చేశారు. జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి జొన్న రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వాసవి రమేష్, సీనియర్ నాయకులు అన్నారం వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి ప్రతాపరెడ్డి, నర్సా గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అట్లా మెసేజ్ సెల్ అధ్యక్షుడు రాజు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.