చెడగొట్ల వానతో చేతుకొచ్చిన పంట నేల పాలు

0 1,547
  • ఆందోళనలో రైతన్నలు

 

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని మధ్యాహ్నం నుండి అకాల వర్షం ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురవడంతో రైతులకు చేతుకు వచ్చిన వరి పంట నేల మట్టం కావడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు  పండించుకున్న పంట తమ చేతికికందకుంట పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.ఈదురు గాలులు వడగాల్ఫులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పై అధికారులు స్పందించి ప్రభుత్వం సర్వే చేసి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.అలాగే అక్కడక్కడ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలలో తరలించిన వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు రైతన్నలు ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళనలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.