30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

విదేశాలకు భారతీయుల అక్రమ రవాణా

Must read

📰 Generate e-Paper Clip

హరియాణా శివాలయంలో లేఖ కలకలం

నిజామాబాద్ జిల్లా వ్యక్తి పేరిట లేఖ లో అడ్రస్

వెబ్ న్యూస్,బతుకమ్మ :  దేశవ్యాప్తంగా దాదాపు 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్థాన్, దుబాయ్ లకు అక్రమ చేసినట్లు ఓ లేఖ కలకలం రేపుతోంది.  హరియాణాలోని హిస్సార్ రెడ్ స్క్వేర్ వద్ద శివాలయంలో పూజారికి ఈలేఖ శనివారం దొరికింది. కాగా ,ఈలేఖపై తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన ఆలకుంట సంపత్ చిరునామా ఉంది. హిస్సార్, అంబాలా, గురుగ్రాం, సిర్సా, రేవాడీ, గంగానగర్, అజ్ మేర్, నర్వానా తదితర నగరాల నుంచి కిడ్నాపులు జరిగినట్లు ఈలేఖలో ఉంది. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకొని, కవరు పై పేరు ఉన్న వ్యక్తిని గుర్తించడానికి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. ప్రజలు పుకార్లను పట్టించుకోవద్దని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ కోరారు.

More articles

Latest article