25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విజన్ తో ముందుకు

Must read

📰 Generate e-Paper Clip

. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ కృషి

. ఆడ బిడ్డలు ఆనందంగా ఉన్నారు

. రుణాల నుంచి రైతులకు విముక్తి

. టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి

. ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందని, దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకలకు రమేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన, అవుతున్న ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి రాష్ట్ర అవరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Forward with the vision

పటేల్ రమేశ్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్య అంశాలు..

ఇందిరా మహిళా శక్తిలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 12 వేల 905 యూనిట్లను 169 కోట్ల 29 లక్షల రూపాయల పెట్టుబడితో, పట్టణ ప్రాంతాల్లో 149 యూనిట్లు 5 కోట్ల 76 లక్షల రూపాయల పెట్టుబడితో వివిధ రకాల వ్యాపార సంస్థలను ప్రారంభించాం. యాసంగిలో 3 లక్షల 72 వేల 965 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 446 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి రైతులకు రూ.800 కోట్లు చెల్లించాం. ధాన్యం సేకరణ ద్వారా మహిళా సంఘాలకు 3 కోట్ల 20 లక్షల రూపాయల లబ్ది చేకూరింది. అకాల వర్షాల కారణంగా జిల్లాలో రైతులు 480 ఎకరాల్లో పంటలు నష్ట పోగా493 మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశాం. లక్ష మందికిపైగా రైతులకు రైతులకు రూ.733 కోట్ల 22 లక్షల రూపాయల రుణ మాఫీ చేశాం. జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన రైతుల కుటుంబాలకు రైతుబీమా ద్వారా రూ.34 కోట్ల 65 లక్షలు జమ చేశాం. జిల్లాకు 11 వేల 153 ఇళ్లు మంజూరు కాగా2 వేల 894 ఇండ్ల నిర్మాణం ప్రారంభించాం. అందులో 144 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేయడం జరుగగా, ఇట్టి లబ్దిదారులకు ఇప్పటి వరకు 1 కోటి 9 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో అమృత్ 2.0 పథకము కింద రూ.180 కోట్ల రూపాయలతో చేపట్టబడిన నీటి సరఫరా పనులు పురోగతిలో ఉన్నాయి.

మరికొన్ని ముఖ్యాంశాలు…

. మహిళలకు పెట్రోల్ బంక్ లు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ అప్పగించాం. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రారంభించింది.
. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించిఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయటం జరిగింది.
. దేశ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రైతులను రుణాల నుంచి విముక్తులను చేశాం. రూ.20,617 కోట్ల రుణాలు మాఫీ చేశాం.
. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం.
. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నాం.
. గతేడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు.
. పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Forward with the vision

More articles

Latest article