ఏఆర్ పి క్యాంప్ లో అంగరంగ వైభవంగా సీతా రాముల కళ్యాణోత్సవం
ఎడపల్లి, బతుకమ్మ : ఎడపల్లి మండలంలోని ఏ ఆర్ పి క్యాంప్ గ్రామంలో శుక్రవారం శ్రీ రామనవమి ని పురస్కరించుకుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణతో వేలాది మంది భక్తుల మద్య సీతా రామ కళ్యాణాన్ని నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవానికి చుటు ప్రక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరై కళ్యాణాన్ని కనులారా వీక్షించి సీతా రాముల ఆశీస్సులు అందుకున్నారు. వేద పండితులు కృష్ణ...