24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా సాయిబాబా మందిర రజతోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎల్ బి ఎస్ నగర్ లో గల అఖిల భారతీయ భగవద్గీత ప్రచారమండలి లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రజతోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రాతః కాలం నుండే సాయిబాబా సుప్రభాత సేవలు, అభిషేకాలు, మంత్ర పుష్పార్చన, ధూప దీప మంగళ నిరాజనాలు, ఫలనైవేద్యాలు, సాయి నామస్మరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఎసిపి శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకట్ నారాయణ, న్యాయమూర్తి శేష తల్ప సాయి దంపతులు, ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ రెడ్డి దంపతులు తదితర ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి సాయిబాబాని దర్శించుకున్నారు. ఆలయాన్ని నిర్వాహకులు పుష్పాలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి కేంద్ర కార్యాలయం నిజామాబాద్ అనుబంధ సంస్థ బోధన్ ఆలయ కమిటీ అధ్యక్షులు అశోక్ రావు కులకర్ణి, కోశాధికారి పబ్బ మురళి, పాలక మండలి సభ్యులు గోపాల్ రెడ్డి, సింది విజయ్ సుధాకర్ చారి నర్మదా, ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ పాఠక్ సుజిత్ పాండే తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.

Silver festival of Saibaba temple

More articles

Latest article