ఘనంగా సాయిబాబా మందిర రజతోత్సవం

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎల్ బి ఎస్ నగర్ లో గల అఖిల భారతీయ భగవద్గీత ప్రచారమండలి లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రజతోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రాతః కాలం నుండే సాయిబాబా సుప్రభాత సేవలు, అభిషేకాలు, మంత్ర పుష్పార్చన, ధూప దీప మంగళ నిరాజనాలు, ఫలనైవేద్యాలు, సాయి నామస్మరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఎసిపి శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకట్...