ఇందూర్, బతుకమ్మ :
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నాయకులు మౌనదీక్ష చేపట్టారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు, అష్టాంగ ఆందోళనలు చేపట్టామన్నారు. నగరంలోని హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్కులో గల మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీలకు న్యాయంగా దక్కవలసిన వాటా దక్కే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో సత్య ప్రకాష్, కరిపే రవీందర్,దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్, బగ్గలి అజయ్,చంద్రమోహన్, శ్రీలత,చంద్రకాంత్,సదానంద్, ఆర్టీసీ శ్రీనివాస్, తంగళ్ళపల్లి శ్రీనివాస్, ఓంకార్ మురళి, దయానంద్, ప్రసాద్, నరేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
