నిజామాబాద్, బతుకమ్మ :
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని గురువారం ఉదయం నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర్వ స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు.కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఎప్పటిమాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేశామన్నారు.ఆ స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.మొంథా తుపాను వల్ల రకరకాల నష్టాలు జరిగాయని ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని,డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయని, మనోధైర్యంతో ఉండాలని కవిత కోరారు.
