వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి బల్లులు బొమ్మలను మార్చి కొత్తగా ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వీటిని తాకేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులకు వస్తుంటారు. ఈబొమ్మలు ఉన్న ప్రాంతంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో అక్కడున్న పురాతన బంగారు, వెండి బల్లులను మార్చేసి కొత్తగా ఏర్పాటు చేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం ఆలయంలో విచారణ చేపట్టారు.
