బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మౌనదీక్ష

ఇందూర్,  బతుకమ్మ :   బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నాయకులు మౌనదీక్ష చేపట్టారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు  రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు, అష్టాంగ ఆందోళనలు చేపట్టామన్నారు.  నగరంలోని హనుమాన్...