25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని , విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఎంఈఓ నరేందర్  తెలిపారు. మంగళవారం ఆలూర్ మండల కార్యాలయంలో ఉపాధ్యాయులతో పదవ తరగతి విద్యార్థుల ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 40% కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల పై ప్రధానోపాధ్యాయులు అమలు పరుస్తున్న ప్రత్యేక కార్యాచరణ గురుంచి ప్రణాళిక అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షలలో మంచి ఫలితాల సాధన కొరకు వివిధ సూచనలు చేశారు. వెనకబడిన విద్యార్థులతో ప్రాక్టీసు పెంచుటకు,ఆ విద్యార్థులను అడాప్షన్ తీసుకున్న ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని ఎంఈఓ  తెలిపారు. వివిధ విషయాల్లో గతంలో వచ్చిన ప్రశ్న పత్రాల ను అనాలసిస్ చేసి సి,డి గ్రేడ్ విద్యార్థులతో ప్రాక్టీసు చేయించాలని తెలియజేశారు. గ్రాండ్ ఫైనల్ వరకు అందరూ విద్యార్థులు 100% హాజరు అయ్యేలా జాగ్రత్త వహించాలని, గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం పెంచేలా ప్రధానోపాధ్యాయులు అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు.

More articles

Latest article