24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వామపక్షాల ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాల దహనం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, సిపిఐ ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు  సూర్య శివాజీ, సిపిఐ ఎమ్ ఎల్ న్యు డెమోక్రసీ లిబరేషన్ జిల్లా కార్యదర్శి కాజా మొయినుద్దీన్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు ఏమీ ఒరిగింది లేదని అన్నారు. మధ్యతరగతి ప్రజలకి పోరాటాన్ని కల్పిస్తున్నామని నమ్మించడమే తప్ప ఏమీ లేదని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కానీ రైతన్న ఆదుకోవడం గాని కార్మికుల కనీస వేతనం కానీ ఈ బడ్జెట్ లో నయా పైసా ప్రయోజనం లేదని అన్నారు.ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటులో బడ్జెట్ను వెంటనే సవరించి కార్మికులకి, రైతులకి, మేధావులకి, ఉద్యోగులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా అసంఘటిత రంగ కార్మికులందరికీ ఆదుకునే విధంగా సవరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, బి రవి, కుల్దీప్ శర్మ,యాట కనకయ్య, నవీద్, సాయులు, కల్లిం, సజీద్ ఖాన్, సిపిఐ ఎంఎల్ నాయకులు ప్రిన్స్, పాషా, లిబరేషన్ నాయకులు మందుల పోసెట్టి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article