. . . నిజాం సాగర్ కు 75,000 క్యూసెక్కుల వరద
. . . 7 గేట్లు ఎత్తి నీటి విడుదల చేసిన జుక్కల్ ఎమ్మెల్యే
. . . ఉదయం 16 గేట్లు ఎత్తివేస్తామని ప్రాజెక్టు అధికారుల ప్రకటన
నిజాం సాగర్, బతుకమ్మ:
మంజీరా నదిపై కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట వద్ద నిర్మించిన నిజాం సాగర్ నిండుకుండలా మారింది. ప్రాజేక్టుకు ఆదివారం రాత్రి 90,000 క్యూసెక్కుల వరద పోటెత్తింది. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజేక్టుకు 14.162 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దాదాపు లక్ష క్యూసెక్కుల వరద రావడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు, ప్రాజెక్ట్ ఈఈ సోల్మాన్, ఎఇ శివప్రసాద్, సాకేత్ లతో కలిసి 7 గేట్లు ఎత్తివేశారు. ఆదివారం రాత్రి వరద గేట్ల ద్వారా 58,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు..నిజాంసాగర్ ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ కు భారీ ఇన్ ఫ్లో ఉన్నందున, అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సోమవారం ఉదయం నిజాంసాగర్ వరద గేట్లు 16 ద్వారా నీటి విడుదల చేయడం జరుగుతుంది కావున ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారుల సూచనలు చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతుండటంతో మంజీరా నదిలోకి ప్రవాహం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో పంటలకు సాగు నీటికి డోకాలేకుండా పోయింది.

