27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ముసురేసింది

Must read

📰 Generate e-Paper Clip

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దంచికొట్టిన వానలు
  • రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు
  • వాగులు, వంకలకు జలకళ
  • శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు తొలిసారిగా పెరిగిన ఇన్ ఫ్లో
  • ఉమ్మడి జిల్లాలో అప్రమత్తమైన అధికార యంత్రాంగాలు

 

నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లాలో వాన ముసురేసింది. వర్షకాలంలో తొలిసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడ తెరిపి లేని వానలు కురుస్తున్నాయి. వర్షకాలం ప్రారంభమై నెల రోజులు గడిచిన ఆషాడం ముగిసిన వర్షాల జాడ లేక రైతులు దిగాలు పొందారు. అమవాస్య నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో చిరు జల్లులతో ప్రారంభమై ఒక మోస్తారు వర్షం పడింది. శుక్రవారం నుంచి వర్షం జోరు పెంచడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విసర్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కంటే కామారెడ్డి జిల్లాలో ముందుగా వర్షాలు ప్రారంభం కావడంతో అక్కడ సగటు వర్షపాతం ఎక్కువగా నమోదైంది. కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు పోచారం, కళ్యాణి లాంటి చిన్న తరహ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పైనుంచి వరద వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాం సాగర్ కు శనివారం ఉదయం 2 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో ఉండగా సాయంత్రానికి 6,500 క్యూసెక్కుల వరధ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో వరదలకు ప్రజలను అప్రమత్తం చేసేందుకు గాను కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంచేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీంలను ఏర్పాటు చేశారు. వాగులు, వంకలు, ప్రాజెక్టులకు వరద వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పలు లోతట్టు ప్రాంతాలలో వాగులు పొంగిపొర్లుతుండటంతో పలు మార్గాలను మూసివేశారు.

  •  నిజామాబాద్ జిల్లాలో మోస్తారు వానలు..

ఇందూర్ జిల్లాలో వర్షం ఆలస్యంగా కురువడంతో పాటు రెండు రోజులుగా ఒక మోస్తారును మించి కురియలేదు. నవీపేట్ మండలంలో శనివారం సాయంత్రం వరకు 42.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రూద్రుర్ లో 38.8, రెంజల్ 38.5 , నిజామాబాద్ రూరల్ మండలంలో 38.3, డోంకేశ్వర్ లో య34.0, బాల్కొండ లో 34.0, సిరికొండలో 33.8, జక్రాన్ పల్లిలో 31.5, ఎడపల్లి, వర్ని మండలాల్లో 29.5 , ఆలూర్ లో 28.8 ముప్కాల్, మాక్లూర్ లో 28.0, డిచ్ పల్లిలో 27.3, నిజామాబాద్ సౌత్ మండలంలో 27.0, నందిపేట్ లో 26.8, కమ్మర్ పల్లిలో 25.3,బోదన్ లో 24.5, మోర్తాడ్ లో 24.6, ఇందల్వాయిలో 22.8 వెల్పూర్ లో 22.0 చందూర్ 21.5, ఎర్గట్ల, పోతంగల్ లో 21.3, నార్త్ మండలంలో 20.8, కోటగిరి 20.3, ధర్పల్లిలో 19.8, ఆర్మూర్ లో 19.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు 6500 క్యూసెక్కుల వరధ వస్తుండగాప్రస్తుతం ప్రాజెక్టులో 22.053 టియంసీల నీరు నిల్వఉంది. జిల్లాలోని రాళ్లవాగు, కప్పల వాగు, వాడి, లింగాపూర్ వాగులు జల కళ ఉట్టిపడుతున్నాయి. రుద్రుర్ మండలంలో గుండ్ల వాగు లో లెవేల్ బ్రిడ్జీ పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపైనుంచి రాకపోకలను నిలపివేశారు.

  • కామారెడ్డి జల్లాలో మూడోరోజు ముసిరేసిన వానలు..

కామారెడ్డి జిల్లాలో వరుసగా మూడవ రోజు వాన ముసురేసింది. కామారెడ్డి జిల్లాలో మిల్లీ మీటర్లను దాటి సెంటిమీటర్ల వర్షం కురుస్తుంది. కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా 66.8 మిల్లీ మీటర్లు, మద్నూర్ లో60.8, మహ్మద్ నగర్ లో 56.3, బాన్సువాడ 54.0, మద్నూర్ 51.8, బిచ్కుంద, నసూరుల్లాబాద్ లో 49.3, కామారెడ్డిలో 47.8 . డోంగ్లీ 47.0, బిర్కూర్ 45.5, తాడ్వాయి44.0, జుక్కల్ 41.3, మాచారెడ్డి 41,0, సదాశివ నగర్40.5, పాల్వంచ 39.3, రాజంపేట్ 34,0, రామారెడ్డి 33.3, లింగంపేట్ 32.8, బిక్కనూర్ 30.5, దోమ కోండ 29.5, బిబిపేట్ 22.5, పెద్ధ కోడప్ గల్ 21.8, నిజాం సాగర్ 19.0, పిట్లం17.5, నాగిరెడ్డి పేట్ 14.5, ఎల్లారెడ్డి లో అత్యల్పంగా 2.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.  నిజాం సాగర్ ప్రాజేక్టుకు 1,270 క్యూసెక్కుల వరధ వస్తుండగా  ప్రస్తుతం ప్రాజెక్టులో 4.251 టియంసీల నీరు నిల్వ ఉంది. కళ్యాణి, పోచారం ప్రాజెక్టులకు స్వల్ప ఇన్ ఫ్లో వస్తుంది. వాగులు, వంకలకు జలకళ రావడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతుంది. కామారెడ్డి జిల్లాలో సగటు వర్ష పాతంను మించి వానలు పడ్డాయి.

More articles

Latest article