27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఘనంగా శంబాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ చౌక్ వద్ద శుక్రవారం రాత్రి చత్రపతి శివాజీ మహారాజ్ పుత్రుడు మరాఠా సామ్రాజ్యా యోధుడు శంభాజీ మహారాజ్ జయంతి వేడుకలను హిందూ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. శంబాజి మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైందవ సామ్రాజ్య స్థాపకుడు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు సింహస్వప్నంగా నిలిచి, మరాఠా స్వరాజ్యాన్ని రక్షించారని పేర్కొన్నారు. శంభాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, వారి త్యాగాలను, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, కుమ్మరి గణేష్, కృష్ణంరాజు, ఎముల గజేందర్, బెజగం వెంకటేష్, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్, తాటిపాముల హరీష్, అడప నవీన్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article