27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రభుత్వ ఖాజీపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

తన భర్తతో విడాకులు జరుగకున్న విడాకులు అయినట్టు సర్టిఫికేట్ జారీ చేసి అతను రెండో పెళ్లి చేసుకోవాడానికి కారకుడయ్యాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఖాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వివరాలు ఇలా ఉన్నాయి… నగరంలోని నిజాం కాలనీకి చెందిన సానోబర్ ఖానం అనే మహిలకు నాగారంకు చెందిన కార్ మెకానిక్ షేక్ షహబుద్ధిన్ తో  2024 జనవరి 4న వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేదించడంతో 2024 నవంబర్ 1న మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గృహ హింస కేసు నమోదు చేయగా అప్పటి నుంచి సోనాబర్ ఖానం తల్లి గారింటి వద్ద నిజాం కాలనీలో ఉంటుంది. అయితే షాహబుద్ధిన్ తనకు తన భార్యతో విడాకులు జరిగినట్టు ఒక పేపర్ ఇవ్వగా దానిని దృవీకరించిన ప్రభుత్వ ఖాజీ ముప్తీ మహభూబ్ ఖాన్ 7 పిబ్రవరి 2026న అతనికి రెండవ వివాహం జరిగినట్టు తెలిసిన సోనాబర్ ఖానం గుర్తించి ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోనబర్ ఖానం భర్త షెక్ షాహబుద్ధిన్ తో పాటు అతడికి విడాకులు అయినట్టు దృవీకరించి రెండవ వివాహం జరిపిన గవర్నమెంట్ ఖాజీ ముప్తీ మహభూబ్ ఖాన్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

More articles

Latest article