ఘనంగా శంబాజీ మహారాజ్ జయంతి వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ చౌక్ వద్ద శుక్రవారం రాత్రి చత్రపతి శివాజీ మహారాజ్ పుత్రుడు మరాఠా సామ్రాజ్యా యోధుడు శంభాజీ మహారాజ్ జయంతి వేడుకలను హిందూ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. శంబాజి మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైందవ సామ్రాజ్య స్థాపకుడు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు సింహస్వప్నంగా నిలిచి, మరాఠా స్వరాజ్యాన్ని రక్షించారని పేర్కొన్నారు. శంభాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, వారి త్యాగాలను, ధైర్యసాహసాలను...