నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నూడ చైర్మన్ కేశ వేణు ఆధ్వర్యంలో శనివారం షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ భవన్ నందు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్ క్రాస్ సొసైటీ కి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఊర్డు అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా నియమింపబడిన తర్వాత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు అన్ని విధాలుగా సేవలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు ప్రజలకు అందేవిధంగా షబ్బీర్ అలీ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మరెన్నో అభివృద్ధి ఫలాలు అందించాలి అంటే షబ్బీర్ అలీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్,పీసీసీ కార్యదర్శి రామ్ భూపాల్,జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,సీనియర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ మీసాల,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వికీ యాదవ్,కార్పొరేటర్లు అరుణ్, కుద్దుస్,నవీన్,చరణ్,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,మలైకా బేగం,మాజీ యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం,దుర్గా ప్రసాద్,ప్రవీణ్ యాదవ్,వీరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

