- జిజిహెచ్ లో తాత్కాలిక ఉద్యోగుల తీరు
- ఉన్నతాధికారి పిఎ అంటూ దారుణానికి ఓడిగట్టిన గనులు
- అధికారి దృష్టికి వెళ్లిన తొక్కి పెట్టిన వైనం
- ఓ మహిళ ఉద్యోగినికి అబార్షన్ కు సూచించిన అధికారులు?
నిజామాబాద్, బతుకమ్మ :
వారిద్దరూ పేషంట్ కేర్ విభాగం కింద తాత్కాలిక ఉద్యోగం పొందిన వారు. రోగులను స్ట్రైచర్ల ద్వారా వార్డులకు తీసుకువెళ్లడం తీసుకురావడం వారి విధులు. కానీ అనూహ్యంగా ఓ అధికారునికి పీఏ గా మారిపోయారు. తధానంతరం వారు చేసిన వేధింపులు అంతా ఇంకా కాదు. ఏకంగా నలుగురు మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఘటన ఉన్నతాధికారి వద్దకు వెళ్లగా ఓ రిటైర్డ్ అధికారిని, మరో అధికారి సదరు ఉద్యోగినికి న్యాయం చేయాల్సింది పోయి సర్దుకుపోయి మర్చిపోవాలి అంటూ ఆదేశించారు. ఈ ఘటన గత కొన్ని రోజులుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చర్చనీయంశంగా మారింది. నూతనంగా సూపరింటెండెంట్ బాధ్యతలు చేపట్టిన అధికారి వద్ద తమ గోడు వెళ్ళబోసుకుంటామంటూ సదరు బాధితులు పేర్కొంటున్నారు. ఒక సాధారణ ఉద్యోగులు ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడి ఓ మహిళ ఉద్యోగినికి అబార్షన్ చేయించడం జరిగింది. ఇలాంటి ఘటనలను బయటకు పడకుండా గత అధికారులు తొక్కి పెట్టడం గమనార్హం.
- నలుగురు మహిళ ఉద్యోగినిలకు వేధింపులు?
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని నలుగురు ఒకే విభాగంలో పనిచేసే మహిళ ఉద్యోగిలు తాత్కాలిక ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు గురయ్యారు. సాధారణంగా వార్డులో పని చేసే ఓ తాత్కాలిక ఉద్యోగి ఓ అధికారి వద్ద పిఏ గా కొనసాగాడు. సదరు అధికారికి ఎలాంటి పనులున్న చక్కబెట్టడం ఇంటి పనులు చక్కబెట్టడం ఇలాంటి అన్ని పనులు చేయడం ప్రారంభించాడు. దీంతో సదరు తాత్కాలిక ఉద్యోగి ఉద్యోగినిల పట్ల, ఇతర ఉద్యోగుల పట్ల పెత్తనం చెల్లాయించాడు, ఏది జరిగిన సదరు అధికారికి చెప్పడం వారిని ఇబ్బందులకు గురి చేయడం కొనసాగింది. ఇందులో భాగంగానే ఓ మహిళ ఉద్యోగిని తాను సమయపాలన మార్పు చేయాలని కోరగా సదర్ అధికారికి చెప్పకుండానే నీపై అధికారి కోపంగా ఉందంటూ సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందంటూ పేర్కొన్నాడు. ఇలా భయంకరమైన అధికారాన్ని చెలాయించి వారం రోజులపాటు ఇబ్బందులకు గురిచేసి చివరికి లొంగదీసుకున్నాడు. శారీరకంగా వాడుకొని అబార్షన్ కూడా చేయించాడు. మరో మహిళ ఉద్యోగినిని ఇదే విధంగా లొంగదీసుకునే ప్రయత్నం చేయగా ఆమె ఎదురు తిరిగి ప్రశ్నించింది. దీంతో ఆమెను వదిలేసి ఇదే విభాగంలో మరో ఇద్దరు మహిళలను మీపై ఫిర్యాదులు వచ్చాయంటూ అధికారి సీరియస్ గా ఉందంటూ పేర్కొన్నాడు. వారు ఉద్యోగం పోతుందనే తపనతో అతన్ని బతిమిలాడారు. దీని ఆసరాగా చేసుకొని ఆ ఇద్దరు మహిళ ఉద్యోగిలను లైంగికంగా వాడుకున్నాడు. ఇలా ముగ్గురు మహిళ ఉద్యోగినీలు సదరు తాత్కాలిక ఉద్యోగికి లొంగిపోయారు. మరో కంప్యూటర్ ఆపరేటర్, తాత్కాలిక ఉద్యోగం కొనసాగుతున్న అతను సెక్యూరిటీ విభాగంలో ఉండే మరో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసి వాడుకున్నాడు. ఇందులో ఓ ఉద్యోగి వివాహం కాలేదు గర్భం దాల్చడంతో సదరు తాత్కాలిక ఉద్యోగిని ప్రశ్నించింది. ఇతను అధికారిని మరో రిటైర్డ్ అధికారిని సమక్షంలో సదరు మహిళని సర్దుకుపోవాలంటూ వివాదం చేయవద్దంటూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని అక్కడికక్కడే ముగించేశారు. ఇందులో ఓ రిటైర్డ్ అధికారిని అదే ఆసుపత్రిలో అబార్షన్ కు ప్రేరేపించినట్లు సమాచారం.
- అధికారి అండదండలతో
తాత్కాలిక ఉద్యోగులు ఇద్దరు మహిళల పట్ల లైంగికంగా వేధింపులకు గురి చేయడం వారిని ఆందోళనకు గురి చేయడం అధికారి వద్ద పీఏగా పనిచేస్తున్నామని ప్రచారం చేసుకొని ఈ ఘటనలకు పాల్పడ్డారు. మేము చెప్పిందే వేదం అంటూ ఎలాంటి పనైనా మా ద్వారానే అధికారులు చేస్తుందంటూ పేర్కొన్నారు. ఇలా మహిళ ఉద్యోగిలను భయభ్రాంతులకు గురిచేసి లైంగికంగా వేధింపులకు గురి చేశారు. లైంగికంగా వినని వారిని అధికారి కి తప్పుడు సమాచారం ఇచ్చి ఇబ్బందులకు గురి చేశారు. ఇందులో కొందరిని భయంతో లొంగదీసుకుని శారీరకంగా వాడుకోవడం జరిగింది. ఈ ఘటన ఓ మహిళ ఉద్యోగిని పట్ల అధికారుల వద్ద బట్టబయరు అయినా కానీ ఈ విషయం బయటపడితే ఆసుపత్రి పరువుపోతుందని, అధికారికంగా ఇబ్బందులు ఏర్పడతాయని తొక్కి పెట్టారు. అధికారికి వివిధ విభాగాల నుంచి వచ్చే నజరాణాలు తీసుకొచ్చి ఇవ్వడం, ఇంటికి అవసరమైన వస్తువులను తీసుకువెళ్లడం ఉదయం నుంచి అధికారి వెళ్లే వరకు వారితోటి ఉండడం కొనసాగించారు. సదరు అధికారి కూడా తాత్కాలిక ఉద్యోగిని వెంటబెట్టుకొని ప్రతి పని అతని ద్వారా చేయించడం జరిగింది. దీంతో అతను తన పరపతిని పెంచుకొని మహిళ పట్ల వేధింపులకు గురి చేశాడు. దీని ఆసరాగా చేసుకుని నలుగురు మహిళలకు వేధింపులకు గురిచేసి లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడు.
- 7వ అంతస్తులో లీలలు
అధికారి పీఏగా పేర్కొంటున్న తాత్కాలిక ఉద్యోగి తనకు ప్రత్యేకంగా ఏడవ అంతస్తులో ఓ గదిని తీసుకున్నాడు. ఆ గదిలో కార్యాలయ పనులు చక్కబట్టేందుకు ఉంటున్నానంటూ పేర్కొన్నారు. కానీ అక్కడ జరిగేవన్నీ లైంగిక వేధింపుల కార్యక్రమాలు. ఈ వ్యవహారానికి సెక్యూరిటీ గార్డ్ విభాగంలోని ఓ మహిళ, మరో ఇద్దరు సహకరించేవారు. వీరికి సహకరించినందుకు ఆరోగ్యశ్రీ నుంచి నిబంధనలకు విరుద్దంగా ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున చెల్లించాడు. దీనివల్ల వారు పూర్తి సహకారం అందించారు. అదే గదిలో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ తరహా వేధింపుల పర్వం తాత్కాలిక ఉద్యోగుల వేధింపులు ఇంతా జరుగుతున్నా అధికారులు మాత్రం గుర్తించకపోవడం, తెలిసిన మాత్రం వాటిని నివారించకపోవడం ఏమాత్రం సమంజసం లేదని తెలుస్తోంది. అక్కడ జరిగే ఘటనలు బయటకు వెళ్తే ఆసుపత్రి పరువు పోతుందనే నేపంతో అన్యాయాలను అరికట్టకుండానే వదిలేశారు. అధికారి పేర్కొన్న సదరు తాత్కాలిక ఉద్యోగులు వేధింపుల పరువాలతో పాటు అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి. ఉన్నతాధికారులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
