బతుకమ్మ,ఏర్గట్ల: మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుండి ప్రభుత్వ అధికారులచే వ్యవసాయ భూముల సర్వే నిర్వహించడం జరుగుతుందని ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు.16 తేదీ నాడు గుమ్మిర్యాల, తాళ్ల రాంపూర్ లో.17 దొంచంద, తొర్తి లో 18 నుండి 20 తేదీ వరకు తడ్ పాకల్, ఏర్గట్ల, బట్టపూర్ గ్రామాల్లో రైతులు ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండి వ్యవసాయ భూముల సర్వేకు సహకరించగలరని ఏర్గట్ల మండల తాసిల్దార్ శ్రీలత, వ్యవసాయ అధికారి వైష్ణవ్, తెలిపారు.
