30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కారు ఢీకొని ఏడేళ్ల బాలుడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ముజాహిద్ నగర్ లో ఏడేళ్ల బాలుడు కారు చక్రాల కింద పడి నలిగిపోయాడు ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ముజాహి నగర్ కు చెందిన బాలుడు ఖయ్యూం (7) రోడ్డుపైన మరికొందరు బాలులతో ఆటాడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి బాలుడి పైనుంచి తీసుకెళ్లడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించారు. ఖయ్యుమ్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బాధితులు ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సిసి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలుడి మృతికి కారణమైన కారు ప్రముఖ ఫ్రూట్ వ్యాపారి సంబంధించినదిగా గుర్తించారు. వ్యాపారి తనయుడు నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మరణించినట్టు స్థానిక యువకులు ఆరోపిస్తున్నారు. కేసును సెటిల్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

More articles

Latest article