కారు ఢీకొని ఏడేళ్ల బాలుడి మృతి
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ముజాహిద్ నగర్ లో ఏడేళ్ల బాలుడు కారు చక్రాల కింద పడి నలిగిపోయాడు ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ముజాహి నగర్ కు చెందిన బాలుడు ఖయ్యూం (7) రోడ్డుపైన మరికొందరు బాలులతో ఆటాడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి బాలుడి పైనుంచి తీసుకెళ్లడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించారు. ఖయ్యుమ్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బాధితులు ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు...