27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ ల బదిలీలు

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న తరుణ్ జోషిని ప్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించారు. అయితే ఇక్కడ పని చేస్తున్న సుధీర్ బాబు ఈ నెలాఖారున పదవి విరమణ పొందనున్నారు. విజిలెన్స్ డీజీగా ఉన్న శిఖ గోయల్ ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరిగా బదిలీ చేశారు. పోలీసు పర్సనల్ అడిషనల్ డీజీగా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్ ను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా నియమించారు. డ్రగ్స్ కంట్రోల్ డీజీగా ఉన్న షాన్వాజ్ ఖాసీంను మల్టీజోన్ -2 ఐజీగా బదిలీ చేశారు. ఎస్ఐబీ ఐజీపీగా ఉన్న బి.సుమతిని మేడ్చల్ మల్కాజ్ గిరి సీపీగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న కార్తీకేయను ఎస్ఐబీ ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి సీపీగా ఉన్న అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ గా, ఏసీబీ డైరెక్టర్ గా కూడా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.

More articles

Latest article