27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్రిడిటేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. అర్హులైన వారికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, జి.ఓ. 252 నిబంధనలను తప్పక పాటించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం మార్పులను దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీపీఆర్‌వో తిరుమల, కమిటీ సభ్యులు వి. రజనీకాంత్, మంత్రి ఆంజనేయులు, ఉక్కల్కర్ రాజేందర్‌నాథ్, వేణుగోపాల చారి, సయ్యద్ కౌసర్ అలీ, వి. శశిధర్, షేక్ మొయినుద్దీన్, బొక్కల వేణు, గంట చంద్రశేఖర్, మహమ్మద్ ఆబిద్ తదితరులు పాల్గొన్నారు.

 

Rules must be followed in the accreditation process

More articles

Latest article