29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కేదురు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఈసీ విధులలో జోక్యం చేసుకోలేమన్న హై కోర్టు ధర్మసనం

. . . ఈసీ అభ్యంతరాలకు సమాధానం ఇచ్చి రండి

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

 

తన నూతన పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్‌ఎస్‌) పేరును కేటాయించాలంటూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పాత పార్టీ ని పోలి ఉండే ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని, ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులను ఆమె కోర్టులో సవాలు చేశారు. మంగళవారం కవిత పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ముందుగా ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన సమాధానం ఇవ్వాలని కవితకు స్పష్టం చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం విధుల్లో తలదూర్చడం అవుతుందని పేర్కొంటూ, ముందుగా ఈసీకి సమాధానాలు చెప్పాకే కోర్టుకు రావాలని సూచించింది. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

 

More articles

Latest article