విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాల కు బలి కాకూడదు

0 4,550

 

. . .విద్యార్థుల చేతిలో పుస్తకం ఉండాలి… ఫీజు బకాయిల నోటీసులు కాదు.

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలికాకూడదు… ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే ప్రతి విద్యార్థి పక్షాన బీజేవైఎం, బీజేపీ రోడ్లపైకి వచ్చి పోరాడతాయి” అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని   బాపూజీ వచనాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ ,బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హాజరై మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన  సుమారు 8 వేల  కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు, మరో 2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించలేక చదువు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Students' futures should not be sacrificed to politics

విద్యార్థుల భవిష్యత్తు తో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలు అమలు కాలేదు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని, త్వరలోనే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో బీజేవైఎం తెలంగాణ కో కోశాధికారి ఆమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ లక్ష్మి నారాయణ ,కార్పొరేటర్ దాంపల్లి జ్యోతి, పంచారెడ్డి అనిత, బంటు రాము,బెల్లాల్ శశాంక్,  సత్యపాల్, వినోద్ రెడ్డి, ఇందూరు సుధా, బీజేపీ నాయకులు మాస్టర్ శంకర్, ఆనంద్ రెడ్డి,గిరిబాబు,బీజేవైఎం నాయకులు విపుల్ రావు, రాజ్ గణేష్, రాకేష్, నిరుద్యోగ యువత పాల్గొన్నారు

Students' futures should not be sacrificed to politics

Leave A Reply

Your email address will not be published.