28.2 C
Hyderabad

అత్యుత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి సేవా పథకాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 13 మంది సిబ్బందికి పథకాలు అందజేసిన ప్రభుత్వ సలహాదారు, సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 13 మంది పోలీసు సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలతో ఘనంగా సత్కరించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సేవా పతకాల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా పోలీసు సిబ్బందికి సేవా పతకాలను అందజేశారు.

 

Service medals for police personnel who rendered outstanding service.

 

విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించినందుకు ఈ పతకాలకు వారు ఎంపికయ్యారు. సేవా పతకాలు అందుకున్న వారిలో సి.ఎస్.బి. నిజామాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. శ్రీధర్ రెడ్డి, ఫింగర్‌ప్రింట్ ఇన్స్ పెక్టర్ కె. రాజేందర్, ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్‌ కు చెందిన ఏ.ఆర్.ఎస్.ఐ. వై. సంజీవ్, ముప్కాల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి. చంద్రశేఖర్, ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఆర్. చంద్రశేఖర్, మహమ్మద్ అబ్దుల్ సలీం, నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఏ. సాయిలు ఉన్నారు.

 

Service medals for police personnel who rendered outstanding service.

 

అలాగే బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ టీ.వీ. గంగా మోహన్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ ఆర్. కనకయ్య, ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ ఎం. మంగోత్య, టౌన్-3 పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి. శివకుమార్ గౌడ్, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఎన్. కృష్ణ, సి.సి.ఎస్. పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ కునాల స్వప్నలు సేవా పతకాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోలీసు శాఖలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు విశిష్ట సేవలు అందిస్తున్న సిబ్బందిని ప్రభుత్వం గుర్తించి సేవా పతకాలతో సత్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పురస్కారాలు ఇతర పోలీసు సిబ్బందికి సైతం మరింత స్ఫూర్తినిచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమ సేవలకు గుర్తింపుగా సేవా పతకాలు అందుకున్న పోలీసు సిబ్బందిని పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది అభినందించారు.

 

Service medals for police personnel who rendered outstanding service.

More articles

Latest article