28.2 C
Hyderabad

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పలు చోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కార్యాలయం, క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డీఐజీ బాసర జోన్-2 క్యాంప్ కార్యాలయంలో అదనపు కమిషనర్ (అడ్మిన్) శుభం ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అదే విధంగా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ లో ఏఆర్ ఏసీపీ శ్రీరాములు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమం అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను అందజేశారు. అలాగే కార్యక్రమానికి హాజరైన అధికారులు, సిబ్బంది, ఇతరులకు స్వీట్లు పంపిణీ చేశారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పేలా జరిగిన ఈ కార్యక్రమాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

Independence Day celebrations held grandly under the aegis of the Police Department.

More articles

Latest article