అత్యుత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి సేవా పథకాలు
. . . 13 మంది సిబ్బందికి పథకాలు అందజేసిన ప్రభుత్వ సలహాదారు, సీపీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 13 మంది పోలీసు సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలతో ఘనంగా సత్కరించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సేవా పతకాల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్...