27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రశ్నించే గొంతుకులను శాసన మండలికి పంపించండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : విద్యా సమస్యలు,నిరుద్యోగ సమస్యలు తెలిసిన వ్యక్తి,విద్యావేత్త,సామాజిక ఉద్యమకారుడు,తన 19 సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేసి సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణను గెలిపించి,శాసనమండలికి పంపాలని నిరుద్యోగ హక్కుల నేత,అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ కుమార్ ను పిలుపునిచ్చారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నిరుద్యోగులు ఉద్యోగులు పట్టబద్రులు బిఎస్పి బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కు 3వ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయ చేస్తున్నాయి. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కేవలం 12 వేల ఉద్యోగాలే ఇప్పటివరకు నింపడం జరిగింది. అలాగే ఉద్యోగులకు సంబంధించి 317 జీవో తీసుకొచ్చి ఇబ్బందుల గురి చేశారన్నారు. అలాగే ఉద్యోగులు రిటైర్మెంట్  బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఇవాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విద్యార్థుల గురించి,నిరుద్యోగుల గురించి మాట్లాడే నాథుడే కరవయ్యారని, 19 సంవత్సరాలుగా ఉద్యోగ జీవితాన్ని కొనసాగించిన,అలాగే ఒక లెక్చరర్ గా పనిచేసినటువంటి ప్రసన్న హరి కృష్ణకి నిరుద్యోగ సమస్యలు,విద్యార్థుల సమస్యలు,ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి,మేధావి యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి ప్రసన్నను గెలిపిస్తే చట్టసభల్లో వాళ్ళ తరఫున తమ వానిని వినిపించి వాళ్ళ గలాన్ని వినిపించి,వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఆయన ముందుండి పోరాడుతారని స్పష్టం చేశారు. డబ్బుల సంచులతో వస్తున్న బీజేపీ,కాంగ్రెస్ వ్యక్తులను గెలిపిస్తే వాళ్ల ఆస్తులు పెరుగుతాయి తప్ప సమస్యలు పరిష్కారం కావన్నారు.ప్రభుత్వ బడి మూత పడుతుంది,కార్పొరేట్ రాజ్యమేలుతుందని జీవో 46, జీవో 29, జీవో 317లతో నిరుద్యోగులను,ఉద్యోగులను రోడ్డున పడేశారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఓయూ విద్యార్థి నేత సుకేశ్,బంజారా శక్తి మూవ్ మెంట్ రాష్ట్ర యువజన అధ్యక్షులు దేవేందర్ జాదవ్,రవినాయక్,వినోద్ నాయక్ మద్దతు ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో గంగాధర్,ప్రవీణ్ రాజ్,నాగరాజు ప్రణీత్,రంజీత్ పాల్గొన్నారు.

More articles

Latest article