27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

న్యాయవాదుల వృత్తి నైపుణ్యం కోసమే సెమినార్లు

Must read

📰 Generate e-Paper Clip

  •  జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులు, న్యాయవాదుల వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడానికి సీనియర్ న్యాయవాదుల ప్రసంగాలు, ఆలోచన ధార ఉపయోగ పడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి,న్యాయసేవ సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో నిర్వహించిన చట్టాలపై మూడు రోజుల అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. కొత్త, పాత చట్టాలు ప్రజల దరికి చేరే విదంగా పారాలీగల్ వాలంటీర్లు కృషి చేయాలని కోరారు. న్యాయవాదుల వృత్తిజీవనంలో చట్టాల అధ్యయనమే కీలకమని, కోర్టులు వెలువరించే తీర్పులలో చట్టాల అన్వయం ఎలా ఉంటుందనేది చదివి విజ్ఞాన వంతులు కావాలని ఆమె ఆశించారు. అనంతరం సీనియర్ న్యాయవాది జి. వి. కృపాకర్ రెడ్డి ప్రసంగిస్తు ఒక క్రిమినల్ కేసులో ప్రతి అంశాలను చదవాలని అన్నారు.నేరం జరిగిన వెంటనే నమోదు అయిన ప్రాథమిక సమాచార నివేదికలోని వివరాలు, పిర్యాదుదారుల స్టేట్ మెంట్, ప్రత్యక్ష సాక్షుల వాoగ్మూలాలు, నేరస్థల పంచానామా, ముద్దాయిల నేర అంగీకారం క్షుణంగా చదవాలని సూచించారు. నేర విచారణ జరిపిన అనంతరం పోలీసు అధికారులు కోర్టుకు సమర్పించే అభియోగ పత్రంలోని అంశాలు ప్రతి విషయం, ప్రతి పదం న్యాయవాదుల వృత్తికి ప్రమానికమే నని తెలిపారు. హత్య కేసులలో వైద్యుల పోస్ట్ మార్టమ్ నివేదిక, ఫారెన్సిక్ రిపోర్ట్ లను హోమ్ వర్క్ చేసుకుని కేసుల డిఫెన్స్ తయారు కావాలని జివికె పేర్కొన్నారు. క్రిమినల్ కేసులలో ప్రాథమిక అంశాలు కీలకమనే విషయాలు మరువద్దని అన్నారు.క్రిమినల్ కేసులలో ఉన్న అక్షరాలను వంటబట్టిచ్చుకుని న్యాయవాదుల వృత్తి ప్రస్థానం కొనసాగించుకోవాలని జి. వి. కృపాకర్ రెడ్డి కోరారు. కేసులోని పదాల అణువులను కోర్టుల విచారణ సమయంలో మదిలో నిలుపుకుని క్రాస్ ఎగ్జామ్స్ చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన న్యాయసేవ సంస్థ మరిన్ని భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించాలని ఆశించారు. జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ నాల్సా లక్ష్యం మేరకు న్యాయ విజ్ఞాన సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్, బార్ ఉపాధ్యక్షుడు దిలీప్, న్యాయవాదులు పాల్గొన్నారు.

More articles

Latest article