న్యాయవాదుల వృత్తి నైపుణ్యం కోసమే సెమినార్లు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులు, న్యాయవాదుల వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడానికి సీనియర్ న్యాయవాదుల ప్రసంగాలు, ఆలోచన ధార ఉపయోగ పడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి,న్యాయసేవ సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో నిర్వహించిన చట్టాలపై మూడు రోజుల అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. కొత్త, పాత చట్టాలు ప్రజల...