27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్లారెడ్డిపేట జడ్పీహెచ్ఎస్ లో సైకిళ్ల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోడీ కానుక పేరిట కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో  సైకిల్లను మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి,ఎల్లారెడ్డిపేట ఎంఈఓ కృష్ణ హరి లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. బిజెపి జిల్లా అధ్యక్షులు గోపి మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క సైకిల్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ పొన్నాల తిరుపతిరెడ్డి,జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి బందరపు లక్ష్మారెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి,పట్టణ అధ్యక్షులు గంట బాలకృష్ణ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్, నంది నరేష్,రాజిరెడ్డి, సంజీవరెడ్డి, ఆంజనేయులు,మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, బాల గౌడ్,మహేష్,లహరి,సీనియర్ నాయకులు ప్రతీప్ రెడ్డి,గాల్ రెడ్డి, రాజేశం గుప్తా,గాజుల దాస్, పారిపెల్లి రామిరెడ్డి,కిష్టారెడ్డి, నరసయ్య, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article