29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆదర్శ పాఠశాలలో విద్యార్థి నాయకుల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ, బతుకమ్మ: విద్యార్థి దశలో ఉన్నప్పుడే మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని బాల్కొండ విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జరిగిన విద్యార్థి నాయకుల ఎంపిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ఎన్నికల ద్వారా నాయకులుగా ఎన్నుకోవడం అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం విద్యార్థి నాయకులుగా ఎన్నికైన 10వ తరగతి విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదర్శ పాఠశాల విద్యార్థుల యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పాటు అందిస్తున్న ప్రిన్సిపల్  శ్రీనివాస ప్రసాద్ ని  ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల వయసు ప్రిన్సిపాల్ గణేష్ పిఆర్టియు మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు మురళి గోపి విజయలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article