ఆదర్శ పాఠశాలలో విద్యార్థి నాయకుల ఎంపిక
బాల్కొండ, బతుకమ్మ: విద్యార్థి దశలో ఉన్నప్పుడే మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని బాల్కొండ విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జరిగిన విద్యార్థి నాయకుల ఎంపిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ఎన్నికల ద్వారా నాయకులుగా ఎన్నుకోవడం అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం విద్యార్థి నాయకులుగా ఎన్నికైన 10వ తరగతి విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదర్శ పాఠశాల...