నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సూచనల మేరకు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అండర్ 16, అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు. నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్ లో 300 పైగా యువతి, యువకులు పాల్గొన్నారు. ఈ సెలక్షన్స్ లో పాల్గొన్న క్రీడాకారుల లోంచి అండర్ 16 కి 30 మందిని, అండర్ 19 కి 30 మందిని సెలెక్ట్ చేశారు. సెలక్ట్ చేసిన వారికి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు వెంకట్ రెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి అయిన అనంతరం వీరిలోంచి అండర్ 16 కి 15, అండర్ 19 కి 15 మందిని సెలక్ట్ చేసి రెండు టీంలను తయారు చేయనున్నట్టు ఆయన తెలిపారు. వీరిని స్టేట్ లెవల్, డిస్ట్రిక్ట్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ లకు పంపించడం జరుతుందన్నారు. కావున దీంట్లో మెరుగైన ప్రతిభను చూపించిన క్రీడాకారులందరికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు, నయీమ్, లలిత్, విక్రమ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
