27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విజేతలకు బహుమతులు అందజేసిన మంతం మధు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామం లో ఐశ్వర్య హోమ్స్ బిల్డర్స్ మంతం మధు ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు శుక్రవారం మంతం మధు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినందుకు గ్రామ ప్రజలు, గ్రామ యువకులు ఐశ్వర్య హోమ్స్ బిల్డర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడిపల్లి గ్రామ సర్పంచ్ కూన లత సాగర్, ఉప సర్పంచ్ తరిగొప్పుల చిరంజీవి, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article