. . . శుభాకాంక్షలు తెలిపిన కృపాల్ సింగ్ సోడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం ప్రతి జిల్లా నుంచి ఇన్ చార్జ్ లను నియమిస్తుంది. ఈ ప్రక్రియ లో భాగంగా శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఇన్ చార్జి గా సర్దార్ రవీందర్ సింగ్ ను నియమించారు. ఈ నియామకం పట్ల రవీందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయనను ఇన్ చార్జిగా నియమించినందుకు పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
