27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీల పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

 

. . . బిచ్కుంద ఎస్సై గుండెల రాజు

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె నెమలి గ్రామం నుండి బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను టిప్పర్లలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బిచ్కుంద పోలీసులు బండ రెంజల్ చెక్ పోస్ట్ వద్ద ఇసుక టిప్పర్లను పట్టుకున్నారు. ఈ విషయమై బిచ్కుంద ఎస్సై గుండెల రాజు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తవ్వడం లేదా తరలించడం చట్టం ప్రకారం నేరమని, ఎవరైనా ఇటువంటి అక్రమ కార్యక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఎస్సై గుండెల రాజు తో పాటు బిచ్కుంద పోలీస్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article