29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్టీఈ ఆక్ట్ సెక్షన్ 23ని సవరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్టీఏ ఆక్ట్ సెక్షన్ 23 ని సవరించాలి లేదా 35 శాతం మార్కులు వస్తే పరిగణించాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ విధిగా టెట్ ఉత్తీర్ణులై ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయుల్లో గందరగోళాన్ని, ఆందోళన సృష్టించడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయులలో నెలకొన్న టెట్ ఆందోళన తొలగించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, ఆ దిశగా కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆర్టీఈ ఆక్ట్ 2009 అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి చేస్తూ నిర్ణయించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఉత్తీర్ణులై ఉండాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని కేంద్ర ప్రభుత్వ సంస్థ 2010 ఆగస్టు 23న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ తేదీ తర్వాత నియామకాలకు టెట్ పాస్ కావాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందనితెలిపారు. అంటే 2010 ఆగస్టు 23 కంటే ముందు నియామకైనా ఉపాధ్యాయులందరికీ టెట్ పాస్ కావలసిన అవసరం లేదన్నారు.అంత కంటే ముందు నియామకమైనా ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక టెట్ నిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని 35%గా పరిగణించాలని, ఆ దిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article