27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

శుభ్రం చేసిన ధాన్యాన్ని పీపీసీలో స్వీకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : శుభ్రం చేసిన ధాన్యాన్ని మాత్రమే పీపీసీలో స్వీకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం గండిమాసన్‌పేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేకరించిన ధాన్యాన్ని ట్యాగ్ చేయబడిన రైస్ మిల్లులకు సమయానికి రవాణా చేయాలని, ట్యాబ్ ఎంట్రీలు పీపీసీ వారీగా సక్రమంగా నమోదు కావాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు పనిచేయాలని సూచించారు. పీపీసీకి వరి తీసుకురాక ముందు తప్పనిసరిగా శుభ్రం చేయాలని తెలిపారు. 17% లోపు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలన్నారు. తూకం వేయించే ముందు పంట తేమను పరిశీలించుకోవాలని సూచించారు. నాణ్యమైన ధాన్య సేకరణ, వ్యవస్థ పారదర్శకత బలోపేతం కోసం యెల్లారెడ్డి పీఏసీఎస్ సొసైటీ సీఈఓ, సెంటర్ ఇన్‌చార్జ్‌లకు కలెక్టర్ స్పష్టమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ ఆర్ఢీఓ పార్థ సింహ రెడ్డి, డీసీఎస్ఓ, డీసీఓ డీఎంసీఎస్సీ, ఎల్లారెడ్డి తహశీల్దార్, ఎంఏఓ, పర్యవేక్షణ అధికారి, ఏఈఓ, ఎల్లారెడ్డి పీఏసీఎస్ సొసైటీ చైర్మన్, సీఈఓ, రవాణా కాంట్రాక్టర్, సెంటర్ ఇన్‌చార్జ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Cleaned grain should be received at PPC

More articles

Latest article