27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రజల శాంతి భద్రతల నిర్వహణ కోసం 163 సెక్షన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎన్నికల సమయంలో ప్రజల శాంతి భద్రతల నిర్వహణ కోసం 163 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఈ నెల 11 న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమి గూడకూడదని, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 9 వ తేది సాయంత్రం 05:00 గంటల నుండి 14వ తేది ఉదయం 10:00 గంటల వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article