బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రములో పద్మశాలి సంఘానికి చెందిన శ్రీ మార్కండేయ మందిరానికి రేకుల షెడ్డు నిర్మాణం కొరకు ఎస్డీఎఫ్ నిధుల నుండి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ సహకారంతో మూడు లక్షల రూపాయలు మంజూరు చేసి అట్టి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి నిధులకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ కు ఏర్గట్ల గ్రామ పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కామని గణేష్,చుక్కోల్ల నరేష్, ఏఈ భట్టాచార్య,కాంగ్రెస్ పార్టీ డిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఇంచార్జ్ బద్దం లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం మండల అధ్యక్షుడు ముస్కు మోహన్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ పన్నాల నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి,రాజారాం సహదేవ్,మేకల సాయన్న,కురాకుల సాయన్న,మునిమాణిక్యం అజయ్,మెరుగు సురేష్, రషీద్,మదస్తూ చిన్నయ్య, పద్మశాలి సంఘ సభ్యులు కామని శివ,గుండ విఠల్, డాక్టర్ బొచ్చు వేణు,చెవిటి మనోహర్,రాంపల్లి చిన్న భూమయ్య,మాసం వినోద్, పిట్ల మధు,పిట్ల నవీన్, కామని లింగమూర్తి, కృష్ణమూర్తి, గుండా రామకృష్ణ, మచ్చ మారుతి, కామని గణేష్, ఆనందం విజయ్, దత్తు, గంగాధర్, దేవాలయ పురోహితులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
