ముప్కాల్, బత్కమ్మ : జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోయినట్లయితే వాటి స్థానంలో కొత్తవి నాటాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ అన్నారు. ఉపాధి హామీ పనుల విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ముప్కల్ మండలంలో ఆదివారం నిర్వహించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బంది ఆయన అంశాలు వద్ద ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఏపీఓగా ఆగస్టు 15 ప్రశంస పత్రం అందుకున్న శకుంతలను ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, ఏపీఓ శకుంతల, ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
