కోటగిరి, బతుకమ్మ :
కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద హై స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమనికి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ ముఖ్య అతిధిగా పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించారు. వివిధ అంశాలపై విద్యార్థుల రూపొందించిన ప్రదర్శనలను తిలకించిన ఆయన పలు ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. మిషన్ భగీరథ రాకెట్ లాంచింగ్ సోలార్ వ్యవస్థ నెలలు వాటి స్వభావం, వ్యవసాయం పంటల ఉత్పత్తులు, మానవ జీర్ణ వ్యవస్థ, కిడ్నీ పనితీరు సుమారు 150 ప్రదర్శనలను విద్యార్థులు తయారు చేశారు. వాటిని పరిశీలించిన ఆయన భావితరాలకు సైన్స్ పట్ల అవగాహన కలిగించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. భట్టి విధానం చదువుల కన్నా కొత్త ఇన్నోవేషన్ తయారీ విధానాల ద్వారా చదువుతూ విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందన్నారు. నైపుణ్యతలేని చదువుల వల్ల భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోలేక పోతారని ఆయనన్నారు. అనంతరం ఆయనను పాఠశాల తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, ప్రిన్సిపాల్ తెల్ల అక్ష ఉపాధ్యాయ బృందం నఫీజ్, సాయి, పవన్, నాగరాజు, భరత్, రేష్మ, చంద్రకళ, సురేఖ, గంగాసాగరి, సునీత తదితరులు పాల్గొన్నారు.

