26.2 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీ చైతన్య విద్యానికేతన్ లో సైన్స్ ఫెయిర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యానికేతన్ హై స్కూల్లో గురువారం సైన్స్ ఫెయిర్  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మధ్య చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీసి వారి ప్రతిభకు పదును పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడుతాయన్నారు.

Science Fair at Sri Chaitanya Vidyanikethan

అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రిన్సిపల్ అశోక్ యాదవ్ మాట్లాడుతూ  విద్యార్థులు తయారు చేసిన సాంకేతిక సాంస్కృతిక పర్యావరణ ప్రాజెక్టులను తయారు చేయడానికి విద్యార్థులు చాలా కష్టపడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఎంఈఓ రాజ్ గంగారెడ్డి సిఐ  సంపత్ ఎస్సై ఆంజనేయులు, సీనియర్ అడ్వకేట్లు బిక్షపతి, నంద రమేష్, శ్రీధర్,రాజబాబు గౌడ్, ఇంద్రకరణ్  రెడ్డి, భీమ్ రెడ్డి,గాల్ రెడ్డి, నరసింహారెడ్డి, లింబాద్రి, వెంకటేష్, అంకం రాజు, రవీందర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Science Fair at Sri Chaitanya Vidyanikethan

More articles

Latest article