25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

హామీలను అమలు చేయించాలని గాంధీ విగ్రహానికి వినతి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : గత ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసేలా బుద్దినివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.గురువారం గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించిన బీయర్ఎస్ శ్రేణులు హామీల అమలు జాప్యం పై నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో 6 గ్యారంటిలు, 420 హామీలను అమలు చేస్తామని దేవుళ్లపైన ఒట్టు పెట్టి చెప్పి ఇప్పటికి అధికారం లోకి వచ్చి 420 రోజులు అయినా ఇప్పటికి ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు.ఇప్పటికైన ప్రజలకు ఇచ్చిన ప్రకారం హామీలను అమలు చేసేలా కాంగ్రెస్ నాయకులకు బుద్దిని ప్రసాధించేల చూడాలని గాంధీజీని కోరారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం నియోజకవర్గ స్థాయిలో అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో గాంధీజీకి వినతి పత్రాలు అందించి నిరసనలు తెలిపినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండల బీయర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article